కరోనా వ్యాప్తి..కేంద్రానికి ఆనంద్‌ మహీంద్రా సూచన

ప్రజకు నిర్వహించే కరోనా పరీక్షల సంఖ్యను పెంచడానికి ప్రైవేట్ సెక్టార్ ను భాగస్వామ్యం చేయాలి

Anand Mahindra
Anand Mahindra

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈసందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. కరోనా వైరస్ టెస్టింగ్ ప్రక్రియలోకి ప్రైవేట్ సెక్టార్ ను కూడా అనుమతించాలని కోరారు. వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ… ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కరోనా పరీక్షలను తక్కువగా చేసిందని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం భారత్ చేస్తున్న కృషిని ఇతర దేశాలు కూడా అభినందించాయని ఆనంద్ మహీంద్రా చెప్పారు. కానీ మన టెస్టింగ్ రేట్ చాలా తక్కువగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు నిర్వహించే పరీక్షల సంఖ్యను పెంచడానికి ప్రైవేట్ సెక్టార్ ను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కోరారు. కరోనా పరీక్షల నిర్వహణలో మన కెపాసిటీని పెంచుకోవడానికి ఈ పని చేయాలని అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు ట్విట్టర్ ద్వారా విన్నివించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/