మేడారంలో మొక్కలు చెల్లించిన మంత్రి పొంగులేటి

మేడారం మహాజాతరకు వేళయింది. ఎల్లుండి (ఫిబ్రవరి 21) నుండి మేడారం జాతర మొదలుకాబోతుంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు మేడారం కు చేరుకోగా..రేపటి నుండి భక్తుల సంఖ్య భారీగా పెరగనుంది. ఇక ఈ జాతర కు సంబదించిన ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎక్కడ ఏ విషయంలో భక్తులు ఇబ్బంది పడకూడదని మంత్రి సీతక్క దగ్గర ఉండి, ఏర్పాట్లు పరివేక్షిస్తున్నారు.

ఇక ఈరోజు సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం కు చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.’అక్కా మీ రాజ్యానికి వచ్చా.. మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం వచ్చా’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్కతో అన్నారు. మేడారం దర్శనానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి కి మంత్రి సీతక్కతో పాటు పలువురు ఆధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిలువెత్తు బంగారం తులాభారం వేసుకొని సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రద్దీకి అనుగుణంగా మేడారం జాతరకు ఎక్కువ బస్సులు కేటాయించామన్నారు. ఇప్పటిరకు 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో బస్సుల్లో ప్రయా ణించారని చెప్పారు. నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. మేడారం జాతర వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్ కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.