వీరసింహరెడ్డి డైరెక్టర్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్

వీరసింహరెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా గోపీచంద్ డైరెక్ట్ చేసిన వీరసింహరెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయం పట్ల సినీ ప్రముఖులు గోపీచంద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు.

ఈ తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా చిత్రాన్ని వీక్షించారు. అనంతరం గోపీచంద్ మలినేనికి స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని మలినేని గోపీచంద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆనందాన్న అభిమానులతో పంచుకున్నారు.

‘ఇది నాకు నమ్మలేని క్షణం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూశారు. ఆయనకు సినిమా ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో తనకు అన్నింటి కంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్’ అని ట్వీట్ చేశారు.