బాలకృష్ణ ఫై సంచలన కామెంట్స్ చేసిన పోసాని

పోసాని కృష్ణ మురళి మళ్లీ తననోటికి పనిచెపుతున్నాడు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న పోసాని..రీసెంట్ గా జగన్..ఆంధ్ర ప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టడం తో జగన్ ఫై ఎవరైనా కామెంట్స్ చేస్తే..వారిపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు పోసాని. హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న పోసాని నంది అవార్డ్స్ ఫై పలు ఆరోపణలు చేసి విమర్శలపాలవ్వగా..తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ బాలకృష్ణ ఫై సంచలన కామెంట్స్ చేసారు. సీఎం జ‌గ‌న్ ను బాల‌కృష్ణ సైకో అని పిల‌వ‌టంపై స్పందించారు.

‘బాలకృష్ణ‌గారు ఇద్ద‌రినీ తుపాకీతో ట‌పీ ట‌పీమ‌ని కాల్చేశాడు. ఎవ‌రైనా మంచివాళ్లు కాలుస్తారా? సైకోలు కాలుస్తారా? మ‌న‌కు చ‌ట్టం, న్యాయం అన్నీ ఉన్నాయి. ఆయ‌న‌కేమైనా స‌మ‌స్య ఉంటే పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లాలి. కేసులు పెట్టొచ్చు. గ‌న్ ఉంది క‌దాని ఇద్ద‌ర్నీ కాల్చాడు. కాల్చిన త‌ర్వాత ఒక‌రోజైన జైలులో ఉన్నాడా? నేను ఇద్ద‌రినీ కాల్చాన‌నుకోండి. పోసాని అమాయ‌కుడ‌ని వ‌దిలేస్తారా? కొట్టి బొక్క‌లో పెట్టి రిమాండ్‌కి పంపించి జైలులో పెడ‌తారు. నువ్వు ఒక‌రిని కాల్చావు. ఒక‌రోజు కూడా జైలుకెళ్ల‌లేదు. ఎవ‌రు అస‌మ‌ర్ధుడు.. ఎవ‌రు క్రూరుడు, ఎవ‌రు మాన‌సికంగా బాధ‌ప‌డుతున్నారో చెప్పాలి.

మ‌రోసారి మీ ఇంట్లో మీ క‌ళ్ల ముందే నైట్ వాచ్‌మెన్ మీ క‌ళ్ల ముందే చ‌చ్చిపోయాడు. శ‌వం అక్క‌డే ఉంది. కానీ బాల‌కృష్ణ ఏం చేశారు? మేక‌ప్ వేసుకుని డెడ్ బాడీని దాటుకుని షూటింగ్ వెళ్లిపోయాడు. ఎవ‌రైనా ఎప్పుడైనా ఈ విష‌యం అడిగారా? మ‌రి మా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు సైకోనా! బాల‌కృష్ణ సైకోనా ? ఆయ‌న్నే ప్ర‌శ్నించుకోమ‌నండి అని పోసాని అన్నారు.

ఓ సారి స్టేజ్‌పై ఆడాళ్లు క‌డుపు చేయాల‌ని మాట్లాడాడు. ఇలాంటి నీచ‌మైన మాట‌ల‌ను మీరు ఎప్పుడైనా జ‌గ‌న్‌గారి నోటి ద్వారా విన్నారా? ఇలాంటి ఘ‌ట‌న‌లు లెక్క‌లేన‌న్ని ఉన్నాయి. ప‌బ్లిక్‌లో జ‌నాల‌ను కొట్ట‌డంతో స‌హా. ఎప్పుడైనా జ‌గ‌న్ ప‌బ్లిక్‌లో ఎవ‌రినైనా కొట్టాడా? అరేయ్ అనే మాట అన‌టం ముఖ్య‌మంత్రి నోటి నుంచి విన్నారా?’’ అన్నారు.