జనసేనతో పొత్తుపై తేల్చి చెప్పిన సోమువీర్రాజు

రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందని అంత మాట్లాడుకుంటున్నారు. జనసేన – బిజెపి పొత్తు ఖాయమని మొదటి నుండి వినిపిస్తూ వస్తుంది. అయితే కొంతమంది మాత్రం టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందని అంటుంటే మరికొంతమంది మాత్రం జనసేన – టీడీపీ – బిజెపి పార్టీలు కలవబోతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జనసేన తో పొత్తు ఫై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

బీజేపీ.. జనసేనతో పొత్తులో ఉందని సోము తేల్చి చెప్పారు. పొత్తు విషయంలో మాకు క్లారిటీ ఉందని , పొత్తుల విషయంలో ఏది జరగాలో అది జరుగుతుందన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక చర్యల మీద జనసేనతో కలిసి పోరాటం చేస్తూ ముందుకెళ్తామన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేతలను కలిశాక పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదని సోమువీర్రాజు స్పష్టం చేశారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక చీలకుండా ఉండటంపై బీజేపీ పెద్దలతో పవన్ తన వైఖరి చెప్పారని సోమువీర్రాజు వెల్లడించారు.