యాక్షన్ తో స్టార్ట్ చేయబోతున్న ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..ప్రస్తుతం తన ఫోకస్ అంత కొరటాల మూవీ పైనే పెట్టాడు. అతి త్వరలో ఈ మూవీ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో మొదలుకాబోతుంది. కాగా మొదటి షెడ్యూల్ ఓ భారీ యాక్షన్ తో స్టార్ట్ చేయాలనీ కొరటాల ప్లాన్ చేసాడట. యాక్షన్ సీన్స్ అయితే కాస్తా హైఎనర్జీతో వర్క్ స్టార్ట్ అవుతుందని శివ భావిస్తున్నాడట.

ఇందులో భాగంగా షూటింగ్ ఆరంభంమే సముద్రంలో అండర్ వాటర్ ఫైట్ సీన్ ని షూట్ చేయబోతున్నారంట. తరువాత బీచ్ ఫైట్ ని చిత్రీకరిస్తారని సమాచారం. ఈ రెండు యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా టైమ్ తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. వీటిని ముగించుకున్న తర్వాత రెగ్యులర్ టాకీ పార్ట్ షూటింగ్ ని మొదలుపెట్టడానికి కొరటాల ప్లాన్ చేసుకుంటున్నాడట.

ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా ఈమె కు తొలి తెలుగు సినిమా కావడం విశేషం.