మెగా హీరో టీజర్ ను రిలీజ్ చేయబోతున్న ఎన్టీఆర్

మాములుగా మెగా హీరోల చిత్రాలకు మెగా హీరోసే ఎక్కువగా ముఖ్య అతిధులుగా వచ్చి సందడి చేస్తారు. కానీ ఇప్పుడు ఆలా కాదు మెగా హీరోల చిత్రాల్లో ఇతర హీరోలు నటించడమే కాదు ప్రోమోట్ కూడా చేస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తన 15 వ చిత్రానికి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రాబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో తేజు 15వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను డిసెంబర్ 7న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

తేజ్‌కు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్ అనే సంగతి తెలిసిందే. ఆ స్నేహంతోనే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమాను ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ వస్తున్నారని అంటున్నారు. ఈ సినిమా ను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేశారు. అలాగే, ఈ సినిమాలో సుకుమార్ కూడా భాగస్వామి. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సుకుమార్ దర్శకుడు. అలా.. సాయి ధరమ్ తేజ్ సినిమాకు పనిచేస్తున్న అందరూ ఎన్టీఆర్‌కు బాగా కావాల్సిన వాళ్లే కావడం కూడా ఓ కారణం.