అలీ కుమార్తె వివాహానికి పవన్ రాకపోవడానికి కారణం అదేనట

అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులతో పాటు , పలువురు రాజకీయ నేతలు హాజరై , నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే వెడ్డింగ్ రెస్పెషన్ కు ముఖ్యమంత్రి జగన్ తో పాటు పలువురు వైస్సార్సీపీ నేతలు హాజరై సందడి చేసారు. అయితే అంత వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ రాకపోయేసరికి రకరకాల వార్తలు వైరల్ గా చక్కర్లు కొట్టడం స్టార్ట్ అయ్యాయి. అలీ వైస్సార్సీపీ లో ఉన్నందుకే పవన్ హాజరు కాలేదనే ఎక్కువగా ప్రచారం జరుగుతుండడం తో అలీ క్లారిటీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌కు కూడా తన కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రికను అందించినట్లు అలీ తెలిపారు. కానీ ఆయన ఫ్లైట్ మిస్ అయ్యిందని.. లేకపోతే కచ్చితంగా వచ్చేవాళ్లని క్లారిటీ ఇచ్చారు. పవన్ వివాహానికి రావాలనుకున్నారని.. వాళ్ల సెక్యూరిటీ కూడా వచ్చి ఎలా రావాలన్నది ముందే చూసుకున్నారని.. కానీ కుదరలేదన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోన్ రాలేకపోయాను ఏం అనుకోవద్దని ఫోన్ చేసి చెప్పారని అలీ తెలిపారు. ‘అమ్మాయి, అబ్బాయి ఉన్నప్పుడు ఫోన్ చేయండి.. మీ ఇంటికి వస్తాను’ అని పవన్ చెప్పారన్నారు. మరి అలీ క్లారిటీ తో ఇక ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అవుతుంది కావొచ్చు.