దుబాయ్ వేదిక ఫై జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

దుబాయ్ వేదికగా సైమా 2023 వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నిన్న శుక్రవారం తెలుగు , కన్నడ చిత్రాలకు సంబదించిన అవార్డ్స్ జరిగాయి. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమనటుడి అవార్డును ఎన్టీఆర్ సొంతం చేసుకోగా.. ధమాకా మూవీలో అదరగొట్టిన శ్రీలీల ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అలాగే దర్శకధీరుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు , సీతారామం మూవీకి ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది.

ఇక ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘‘నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు. నన్ను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో కొమురం భీమ్‌ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు. ఇక నా సహనటుడు, నా సోదరుడు, స్నేహితుడు చరణ్‌కు కూడా ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ నటిస్తోంది.