కర్ణాటకలో సరికొత్త రికార్డు నెలకొల్పిన కాంతారా

కర్ణాటకలో కాంతారా చిత్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. కన్నడలో సెప్టెంబరు 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌ని అందుకుంది. దాంతో మిగిలిన భాషల్లో కూడా అక్టోబరు 15న రిలీజ్ చేశారు. అయితే.. ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతార రికార్డుల మోత మోగించేస్తూ ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక్క తెలుగులోనే ఈ మూవీ దాదాపు రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ఈ మూవీ కర్ణాటకలో కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడైనట్టుగా చెబుతూ, మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. కేవలం 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా 200 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది.

సినిమా కథ విషయానికి వస్తే కర్ణాటక ప్రాంతంలో .. ఒక గిరిజన గూడెం నేపథ్యంలో నడిచిన కథ. అక్కడి ఆచారవ్యవహారాలను .. విశ్వాసాలను కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. అన్ని పాత్రలు అడవిలోకి వస్తాయి తప్ప, అడవిని దాటి ఏ పాత్ర బయటికి వెళ్లదు. అడవి సాక్షిగానే కథ నడుస్తూ ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో నిర్మితమై ఈ స్థాయి లాభాలను అందుకున్న సినిమా, ఈ మధ్య కాలంలో ఇదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.