బిఆర్‌ఎస్‌కు తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌కి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. బిఆర్‌ఎస్‌లో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈరోజు సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతోపాటు బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు సైతం కాంగ్రెస్‌లో చేరతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తుమ్మలకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.