విశ్వక్ ఓ ఎనర్జీ బాల్ అంటూ జూ ఎన్టీఆర్ ప్రశంసలు

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మార్చి 22 న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ను శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా జూ ఎన్టీఆర్ హాజరై , సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చాడు.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..విశ్వక్ ఫై ప్రశంసలు కురిపించారు. విశ్వక్ మాట్లాడినట్లుగా మైక్‌లో నేనెప్పటికీ మాట్లాడలేను. తనొక ఎనర్జీ బాల్. మామూలుగా మేం కూర్చుంటే నేనే ఎక్కువ వాగుతాను. కానీ నా కంటే ఎక్కువ వాగుతాడు తను. అంటే నేను కూడా సైలెంట్ అయిపోయి విశ్వక్ మాటలు వినేంత స్టేజ్‌కు నన్ను తీసుకెళ్లాడంటే ఇమాజిన్ చేయండి.

నిజానికి నేను బాగా మూడ్ ఆఫ్ అయినపుడు చూసే చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ ఆ చిత్రంలో విశ్వక్, అభినవ్‌ నటనను అలా చూస్తూ ఉండిపోవచ్చు. ముఖ్యంగా విశ్వక్‌.. ఒక నటుడిగా కామెడీ చేయకుండానే ఆ సినిమాలో కామెడీ పండించాడు. విశ్వక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రం చూసినట్లు ఎన్టీఆర్ తెలిపారు. నిజానికి తను పర్సనల్‌గా, యాక్టర్‌గా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడో.. అంతే కాన్ఫిడెంట్‌గా ఆ సినిమాను డైరెక్ట్ చేశాడన్నారు. ఇక ‘ధమ్కీ’ మూవీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయన్న ఎన్టీఆర్.. విశ్వక్ తనను తానే ప్రూవ్ చేసుకునేందుకు బయల్దేరిన నటుడు అని పేర్కొన్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.