నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో విజయవంతంగా 45 రోజులు పూర్తీ చేసుకుంది. ఈ 45 రోజుల్లో లోకేష్ 577 కిలోమీటర్లు నడిచారు.జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. లోకేష్ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. లోకేష్ సైతం ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ, అధికార పార్టీ ఫై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు నుండి ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది.

అన్నమయ్య జిల్లాను దాటుకొని శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించింది. ఈరోజు ఉదయం శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులోని చీకటిమానిపల్లి నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసారు. శ్రీసత్యసాయి జిల్లాకు చేరుకున్న లోకేశ్ పాదయాత్రకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. కేరళ వాయిద్యాలు, కోలాటం, చెక్కభజనతో ఘనంగా స్వాగతం పలికారు.