హైదరాబాద్ కు బయలు దేరిన జనసేనాధినేత

జనసేనాధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి నుండి హైదరాబాద్ కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన పలు ఉద్రికతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో స్పీడ్ పెంచేలా చేసాయి. అధికార పార్టీ పవన్ కళ్యాణ్ పర్యటన ను అడ్డుకోవడం, పవన్ కళ్యాణ్ ఫై దారుణమైన కామెంట్స్ చేయడం , జనసేన కార్య కర్తలపై అరెస్ట్ లు చేయడం , పవన్ ను పర్యటన కు వెళ్లకుండా హోటల్ కే పరిమితం చేయడం వంటివి అందర్నీ బాధపెట్టాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైస్సార్సీపీ నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుపెన్నడూ లేని విధంగా దారుణమైన కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్స్ కు వైస్సార్సీపీ నేతలు కూడా కౌంటర్ లు ఇస్తున్నారు.

పవన్ మీడియా సమావేశం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ..పవన్ కళ్యాణ్ తో సమావేశం అవ్వడం, ఆయనకు సంఘీభావం తెలుపడం తో వైస్సార్సీపీ నేతలు షాక్ కు గురయ్యారు. ఇదే క్రమంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయా విశ్లేషకులు సైతం ఇద్దరు కలిసి పోటీ చేయబోతారనేదానికి ఇదే సంకేతం అని అంటున్నారు. వీరి కలయికతో టీడీపీ – జనసేన కార్య కర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మంగళగిరి నుండి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. రాత్రి చాలాసేపు వరకు కూడా పవన్ పార్టీ నేతలకు పలు డైరెక్షన్లు ఇచ్చారు. అలాగే ఈరోజు ఉదయం కూడా చిత్తూరు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం హైదరాబాద్ కు బయలు దేరారు. మొత్తం మీద వైస్సార్సీపీ చేసిన అతి ఉత్సాహం..ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో స్పీడ్ పెంచేలా చేసిందని అంత అంటున్నారు.