వచ్చే సమ్మర్ లో మహేష్ – త్రివిక్రమ్ మూవీ రిలీజ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి రావాల్సి ఉండగా, అనుకోని కారణాలతో వాయిదాపడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సినిమా తాలూకా అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో ఆసక్తికి తెరతీసింది.

ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించింది. మరోవైపు సంగీత దర్శకుడు తమన్‌ సైతం.. “తెల్లవారుజాము నుంచే మహేశ్‌-త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ ప్రారంభించా” అంటూ పోస్ట్‌ పెట్టారు. చిత్రబృందం నుంచి వచ్చిన లేటెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. #SSMB28గా ఇది ప్రచారంలో ఉంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. ఇందులో మహేష్ జోడీగా పూజాహెగ్డే నటించనున్నారు. గతంలో మహర్షి చిత్రంలో వీరిద్దరూ జోడి కట్టారు. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి జోడి కట్టబోతున్నారు.