చంద్రబాబు భద్రత మీద కేంద్రహోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి..జైల్లో ఉన్న చంద్రబాబు భద్రత ఫై ఎన్ఎస్జీ ..కేంద్రహోంశాఖకు నివేదిక ఇచ్చింది. చంద్రబాబు అరెస్టయిన దగ్గర నుంచి రెండు రోజులు ఏం జరిగిందో మొత్తం నివేదికలో సమర్పించింది.

సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 10 వ తేదీ అర్ధరాత్రి 1గంట వరకూ జరిగిన విషయాన్ని మొత్తం నివేదికలో పొందుపరిచింది. ఏసీబీ కోర్టు రిమాండ్, జైల్లో భద్రత వంటి విషయాల గురించి కూడా అందులో తెలిపినట్లు తెలుస్తుంది. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఏంటి, ఆయనకు భద్రత ఏ విధంగా ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది.

మరోపక్క ఈరోజు ఏసీబీ కోర్ట్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఫై విచారణ జరగనుంది.