ఉత్తరప్రదేశ్ లో దారుణ సంఘటన..4 ఏళ్ల చిన్నారి ఫై అత్యాచారం..

ఉత్తరప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఫరూఖాబాద్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ళ బాలిక ను సడెన్ గా కనిపించకుండాపోయింది. చుట్టుపక్కల ఎంతవెతికా కనిపించలేదు. కొంతదూరంలో పొలంలో కుక్కల గుంపు కనిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా..ఆ పసిపాప ను కుక్కలు కొరుక్కుతింటున్నాయి. ఆ శవం తన కూతురిదే అని తండ్రి గుర్తుపట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. బాలిక మృతి గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని శవపరీక్షలు నిర్వహించారు.

చిన్నారి ఫై అత్యాచారం జరిగినట్లు పరీక్షలో తేలింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. కుటుంబంలోని ఓ యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిపాడు. తాను పొలం నుంచి తిరిగి వస్తుండగా చిన్నారి ఆడుకుంటూ కనిపించిందని నిందితుడు చెప్పాడు. మరో వ్యక్తి సాయంతో పాపను పొలంలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశామని చెప్పాడు. దీంతో యువకుడి మీద కేసు నమోదు చేశారు. ఇందులో భాగస్వామ్యం ఉన్న మరో వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు.