టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీటీడీ సమావేశం

Sri Venkateswara Swamy Vaari Temple
Sri Venkateswara Swamy Vaari Temple

తిరుమల: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా టీటీడీ పాలకమండలి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది. శ్రీవారి ఆస్తులను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచాలని సభ్యుడు శేఖర్‌రెడ్డి కోరారు. టేబుల్‌ అజెండాగా శేఖర్‌రెడ్డి ప్రతిపాదనలు పెట్టారు. దీనిపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారు. కాగా తిరుమల నుంచి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, 10 మంది సభ్యులు హాజరయ్యారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా 26 మంది సభ్యులు పాల్గొననున్నారు. 63 ఆంశాలతో కూడిన ఆజెండాపై పాలకమండలి చర్చించనుంది.

శ్రీవారి దర్శనానికి భక్తులను ఎప్పటి నుంచి అనుమతించాలనే ఆంశంతో పాటు దర్శన విధివిధానాల అమలుపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. గత కొద్ది రోజులుగా టీటీడీని కుదిపేస్తున్న ఆస్తుల విక్రయాల అంశంపై కూడా ప్రధానంగా చర్చించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడి ఈవో నేతృత్వంలో ఓ కమీటిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/