మీకు కాస్తయినా బుద్ధి ఉందా..? అంటూ మీడియా ఫై సమంత ఫైర్

సినీ నటి సమంత మీడియా ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు కాస్తయినా బుద్ధి ఉందా? అంటూ మండిపడ్డారు. గత కొద్దీ రోజులుగా మీడియా లో సమంత – నాగ చైతన్య ల విడాకుల వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వస్తున్న క్రమంలో ఒక్క ఫోటోకు ఫోజివ్వమని మీడియా వారు అడుగగా.. సమంత ఏమాత్రం ఆగకుండా వడివడిగా అడుగులేసుకొంటూ ముందుకు వెళ్లింది.

ఆలా మరో మీడియా వారు ఓ బైట్ ఇవ్వమని అడుగుతూ మీడియా రిపోర్టర్లు వెంబడించడంతో సమంత సహనం కోల్పోయింది. ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడికి వచ్చాను. మీకు బుద్ధి ఉందా అని కోపంగా కామెంట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో దేవాలయాలను దర్శించుకొన్నప్పుడు సమంత మీడియాతో మాట్లాడిన సందర్బాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మీడియా ఫై సమంత ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల మీడియా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.