ఈ నెల21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 20న సీఎం అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినేట్ చర్చించనుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండటం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.

ఈ సమావేశఆలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక అప్పటి పరిస్థితిని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. ఇకఈ సమావేశాలు పలు బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అలాగే ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను కూడా సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.