త్వరలో 13వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్?

TSPSC

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్..నిరుద్యోగుల విషయంలో మరింత ఫోకస్ పెట్టింది. గత పదేళ్లుగా బిఆర్ఎస్ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని ముందు నుండి ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్..ఎన్నికల ప్రచారం లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప కుండా నిరుద్యోగులకు తప్పకుండ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఇప్పుడు అదే విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 12,500 టీచర్ ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 563 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వచ్చే వారం ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. లోకసభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.