హరీష్ శంకర్ డైరెక్షన్లో ప్రభాస్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆదిపురుష్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరచగా..సెట్స్ ఫై ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే , రాజా డీలక్స్ , స్పిరిట్ మూవీస్ ఉన్నాయి. ఇలా వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూనే..మరోపక్క కొత్త కథలు వింటూ వాటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

తాజాగా గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడలో భారీ చిత్రాలను నిర్మించిన KVN ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా కథ ఏంటి..? నటి నటులెవరు ..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు. పవన్ సరసన శ్రీలీల నటిస్తుంది. అలాగే నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర , గిరి , టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అశుతోష్ రాణా, గౌతమి నాగ, మహేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా , అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్ , ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి , చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.