టి కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల ..

టి కాంగ్రెస్ పెండింగ్ లో ఉన్న స్థానాలకు సంబదించిన అభ్యర్థులను గురువారం రాత్రి ప్రకటించింది. అలాగే పటాన్ చెరు స్థానంలో మార్పులు చేసింది ఏఐసీసీ. ముందుగా ఈ టికెట్ నీలం మధుకు కేటాయించిన అధిష్టానం..ఇప్పుడు కట్ట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది.

అలాగే, తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ కు అదిష్టానం షాకిచ్చింది. ఆ స్థానాన్ని ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు కేటాయించారు. అలాగే సూర్యాపేట టికెట్ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కి కేటాయించింది.

పూర్తి అభ్యర్థుల వివరాలు :

సూర్యాపేట:రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
పటాన్ చెరు: కట్ట శ్రీనివాస్ గౌడ్
మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి
తుంగతుర్తి: మందుల సామ్యుల్ (ఎస్సీ)
చార్మీనార్:మహ్మద్ ముజీబ్ ఉల్ షీర్