భారత్‌ను భారత్‌లో ఓడించడం కష్టం
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లబుషేన్ వ్యాఖ్య

హైదరాబాద్: క్రికెట్ అసైన్మెంట్ను పూర్తి చేయడానికి భారత్ క్లిష్టమైన ప్రదేశమని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ అన్నాడు. అంతేకాదు భారత్‌లో భారత్‌ను ఓడించడం ఎంతో కఠినమని కూడా చెప్పుకొచ్చాడు. 25 ఏళ్ల లబుషేన్ ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన తర్వాత తొలి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. భారత్‌లో సిరీస్ అంటేనే ఓ సవాలే. ఎందుకంటే వారు బలమైన ప్రత్యర్థులు. టీమిండియాలో గొప్ప బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. జనవరిలో జరగనున్న వన్డే సిరీస్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ప్లేయర్‌గా నీ ఆట ఏ స్థాయి ఉందో తెలుసుకోవాలంటే కఠిన పరిస్థితుల్లో బలమైన ప్రత్యర్థితో ఆడాలి. భారత్‌లో భారత్‌ను మించిన మరో కఠినమైన ప్రత్యర్ధి ఎవరూ ఉండరు అని అన్నాడు. ఇప్పటివరకు కేవలం 14 టెస్టులు మాత్రమే ఆడిన లబుషేన్ ఐసిసి ఇటీవల ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో అతడిని మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లతో పోలుస్తున్నారు. దీనిపై లబుషేన్ సైతం స్పందించాడు. ఖిఅందరూ గొప్పగా ఆడుతున్నానని విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సనన్, స్టీవ్ స్మిత్‌తో పోలుస్తున్నారు. వారు 67 ఏళ్ల నుంచి ఎంతో నిలకడగా ఆడుతున్నారు. నేను ఈ వేసవిలో మాత్రమే ఆడాను. దీనికే గొప్ప బ్యాట్స్‌మన్‌గా మారిపోను. ప్రస్తుతం నా దృష్టంతా నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందించడమే అని అన్నాడు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/