సులేమానీ అంతిమయాత్రలో ..35 మంది మృతి

కెర్ మన్ లో అంత్యక్రియలు

qassem soleimani-funeral
qassem soleimani-funeral

టెహ్రాన్‌: అమెరికా దాడుల్లో మృతిచెందిన ఇరాన్‌ ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానీ అంత్యక్రియల్లో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 35 మంది మరణించగా, మరో 50 మంది వరకు గాయపడ్డారు. అమెరికా డ్రోన్ దాడిలో హతమైన సులేమానీ అంత్యక్రియలు కెర్ మన్ పట్టణంలో జరిగాయి. సులేమానీ అంతిమయాత్రకు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. దాంతో తొక్కిసలాట ఏర్పడడంతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది. కాగా, సులేమానీ అంతిమయాత్రలో అనేకమంది పొరుగుదేశాల నేతలు కూడా పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/