టి20 వరల్డ్ కప్ వాయిదా?!

కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో నిర్ణయం

T20 World Cup postponed !?
T20 World Cup postponed !?

ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం వెల్లడించనుంది.

కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో మెగా టోర్నీని వాయిదా వేయడమే మేలని భావించిందని సమాచారం. అనుబంధ బోర్డులతో ఐసీసీ వచ్చే వారం వీడియో కాన్ఫరెన్స్‌తో తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

ప్రపంచకప్‌ వాయిదాతోపాటు ఈ నెలాఖరుతో ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం కూడా ముగియనుంది.

దీంతో ఐసీసీ చైర్మన్‌ పదవి భర్తీపైకూడా సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సీనియర్లు భావిస్తున్నారు.

మరోవైపు ఐసీసీ చైర్మన్‌గా మనోహర్‌ పదవీకాలం పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు.

టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా కూడా ఐసీసీ నిర్ణయం మేరకు వాయిదాకు అంగీకరించేందుకే మొగ్గు చూపనుంది.

ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌లాంటి మెగాటోర్నీని నిర్వహిస్తే భారీగా టికెట్‌ రెవెన్యూను నష్టపోతామని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావిస్తోంది.

టోర్నీ నిర్వహణపై ఐసీసీ మూడు ప్రత్యామ్నాయాలను చూపనుంది. మొదటిది టీ20 ప్రపంచకప్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేయడం, ఈ సమయంలో భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌ ఉంది.

దీంతో అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/