ఐవోసీ తీరుపై కశ్యప్‌ ఆగ్రహం

టోక్యో ఒలింపిక్‌ కోసం ప్రాక్టిస్‌.. నవ్వులాటలా ఉందా

parupalli kashyap
parupalli kashyap

హైదరాబాద్‌: దేశంలో కరోనా విస్తరిస్తరిణి అరికట్టె చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలననుసరించి అన్ని రాష్ట్రాలు కూడా కఠిన ఆంక్షలు విదించాయి. ప్రస్తుతం దేశంలో ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది. దీంతో దేశంలో అన్ని రకాల క్రీడా టోర్నీలు రద్దు అయ్యాయి. ఇంతటి విపత్కర పరిస్థితులలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) టోక్యో ఒలింపిక్‌ కోసం ఆటగాళ్ళందరూ ప్రాక్టిస్‌ కొనసాగించండి. అంటూ చేసిన వాఖ్యలపై భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ నవ్వులాటలా ఉందా అంటూ వ్యంగంగా స్పందించాడు. ఒకవైపు కరోనా ప్రభావంతో అన్ని రకాల శిక్షణా కేంద్రాలను మూసివేయడంతో సాధన ఎలా సాధ్యం అవుతుందంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం వివిధ టోర్నీలలో పాల్గొన్న ఆటగాళ్ళందరూ వారివారి దేశాలలో స్వీయ నిర్బంధంలో ఉన్నారని, శిక్షణా కేంద్రాలు కూడా అందుబాటులో లేని ఈ సందర్బంలో సాధన చేయడమేంటని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒలింపిక్‌ వాయిదా వేయడమే మంచిదని కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/