తొలి టైటిల్ సాధించిన బోపన్న జోడి

దోహ: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ సీజన్‌లో తొలి టైటిల్ సాధించాడు. ఖతర్ ఓపెన్ ఏటిపి టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు వెస్లీ కూలాఫ్‌తో కలిసి బోపన్న ఖతర్ ఓపెన్‌లో డబుల్స్ చాంపియన్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ బోపన్న, వెస్లీ జోడీ 3-6, 6-2, 10-6తో ల్యూక్ బాంబ్రిడ్జ్ (బ్రిటన్)శాంటియాగో గోంజాలెజ్ (మెక్సికో) జోడీని ఓడించింది. విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 76,870 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మరో సెమీఫైనల్లో బోపన్న, కూలాఫ్ జంట 7-5, 6-2తో రెండో సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల రోహన్ బోపన్నకు కెరీర్‌లో ఇది 19వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/