చైనా వ్యవహార శైలి సంతృప్తికరంగా లేదు

చైనాతో సంబంధాల్ని పూర్తిగా వదులుకుంటాం

చైనా వ్యవహార శైలి సంతృప్తికరంగా లేదు
trump, jinping

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌ విషయంలో గత కొన్ని రోజులుగా చైనాపై మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే చైనాతో సంబంధాల్ని పూర్తిగా వదులుకుంటామని, ఇందుకు తాము ఏ మాత్రం వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. దీనివల్ల అమెరికాకు 500 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని తెలిపారు. ఆ వైరస్ వ్యాప్తి గురించి చైనా ముందుగా ప్రకటన చేయనందుకే తమ దేశంలో ఇంతగా వైరస్ విజృంభించిందని ఆయన అంటున్నారు. ఈ మహమ్మారి విషయంలో చైనా వ్యవహార శైలితో తాను ఏమాత్రం సంతృప్తికరంగా లేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఇటీవల కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం విషయంలో మళ్లీ చర్చలు జరిపే అవకాశం లేదని ట్రంప్ చెప్పారు. కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో చర్చలు జరపడానికి తాను ఏ మాత్రం ఇష్టపడడం లేదని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/