ఉజ్జయిని మహంకాళి బోనాలు.. రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

Swarnalatha Rangam Bhavishyavani ..Ujjaini Mahankali Bonalu

హైదరాబాద్‌: ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా ఈరోజు రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.. మీ వెంటే ఉంటానని చెప్పారు. ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని, భయపడొద్దని చెప్పారు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.