విమానాల్లో సిబ్బందికి కొత్త డ్రస్ కోడ్

పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌లకు కరోనా సోకని విధంగా..ప్రత్యేక బాడీ సూట్, ఫేస్ షీల్డ్ సిద్ధం

flights-employees

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ అనంతరం విమానాలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విమాన సిబ్బంది దుస్తులను మార్చేశారు. తమ సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లు, విమానాశ్రయాల్లో పనిచేసే ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ ను సిద్ధం చేశాయి. సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు ఫేస్ షీల్డులు, గౌన్లు, మాస్క్ లు, పీపీఈ కిట్లు తదితరాలను అందించాలని నిర్ణయించామని పౌరవిమానయాన సంస్థలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాతో పాటు, ఇండిగో, విస్తారా, ఎయిర్ ఏసియా తదితర సంస్థలు సంయుక్తంగా ఓ నిర్ణయం తీసుకుని, కొత్త వస్త్రధారణను ఖరారు చేశాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ఎయిర్ ఆసియా సిబ్బంది గత నెల 27న కొత్త డ్రస్ కోడ్ లో కనిపించగా, ఆప్రాన్స్, గౌన్లు, మాస్క్ లతో విస్తారా ఎయిర్ లైన్స్ సైతం కొత్త డ్రస్ కోడ్ ను తీసుకుని వచ్చింది. అయితే త్వరలో ప్రారంభంకానున్న దేశవాళీ సేవల్లోనూ ఇదే డ్రస్ కోడ్ ను అమలు చేయనున్నారని తెలుస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/