10 రోజులు నవ్వడం, మద్యం సేవించడం, షాపింగ్ పై నిషేధం

మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ వర్ధంతి నేపథ్యంలో ఆంక్షలు

ప్యోంగ్యాంగ్: దేశ ప్రజలు 10 రోజుల పాటు నవ్వడం, మద్యం సేవించడం, షాపింగ్ చేయడంపై ఉత్తరకొరియా నిషేధం విధించింది. దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ 10వ వర్ధంతి నేపథ్యంలో ఈ నిషేధాన్ని విధించారు. ఈ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని… ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.

గతంలో ఈ సంతాప దినాల సమయంలో మద్యం సేవించిన వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని… వాళ్లు ఇంతవరకు మళ్లీ కనిపించలేదని ఓ వ్యక్తి తెలిపాడు. అంత్యక్రియలను కూడా నిర్వహించడానికి వీలుండదని, పుట్టినరోజులు కూడా ఎవరూ నిర్వహించుకోకూడదని చెప్పాడు. మరోవైపు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉత్తరకొరియా సిద్ధమవుతోంది. కిమ్ జాంగ్ ఇల్ జీవితానికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను చేపట్టబోతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/