ఢిల్లీలో ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసుల నమోదు

నిన్న ఢిల్లీలో వెలుగులోకి 85 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేవలం ఒకే రోజులో 10 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. నాలుగు నెలల తర్వాత ఢిల్లీలో నిన్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 85 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 5న ఇండియాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు దేశ రాజధానిలో 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరితో పది మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఈ సందర్భంగా ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఒమిక్రాన్ విషయానికి వస్తే… ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 32 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఏపీ, తెలంగాణలు ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/