14 దాకా వ్యాక్సిన్ మొదటి డోసు లేదు

రాష్ట్రంలో వాక్సిన్ తీవ్ర కొరత: రెండో డోసువారికి ప్రాధాన్యత: ప్రభుత్వం వెల్లడి

Vaccination
Vaccination

Hyderabad: తెలంగాణ‌ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్ర‌భుత్వం 45సంవ‌త్స‌రాల పైబ‌డిన వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ ఇస్తునప్పటికీ కేంద్రం నుండి వ‌స్తున్న డోసులు స‌రిపోవ‌టం లేదు. దీంతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకునే వారికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన కారణంగా , వారికి ప్రాధాన్య‌త ఇస్తూ, ఫ‌స్ట్ డోసును తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.
సెకండ్ డోసు వారికి స‌మ‌యం మించిపోకుండా ఉండాల‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సెకండ్ డోసు తీసుకోవాల్సిన వారు 11ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్లు సమాచారం. ఈ కారణంగా ఈ నెల 15 వ తేదీ వ‌ర‌కు ఫ‌స్ట్ డోసును ఆపివేస్తున్నటు ప్రకటించింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/