చంద్రబాబు వ్యాఖ్యల పై కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ప్రకృతి వైపరీత్యాల చట్టంకింద కేసు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు

Chandra babu
Chandra babu

కర్నూలులో ఎన్440కే వైరస్ ను గుర్తించారని చంద్రబాబు వ్యాఖ్యలతో కర్నూలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారంటూ సుబ్బయ్య అనే న్యాయవాది కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1) (బి) (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్ 440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని, ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/