సబితమ్మ ఇప్పుడే నిద్ర లేసింది అంటూ స్కూల్స్ సెలవు ప్రకటన ఫై రఘునందన్ సెటైర్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూల్స్ కు రెండు రోజులు సెలవు ప్రకటించారు రాష్ట్ర సర్కార్. దీనిపై మంత్రి సబితా ఫై తల్లిదండ్రులు , ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలవు ప్రకటిస్తే ఓ రోజు ముందు చెప్పడమే..లేదా ఉదయాన్నే ప్రకటించడమే చేస్తారు కానీ తీరా స్కూల్స్ కు పంపించిన తర్వాత ప్రకటించడం ఏంటి అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్ ఏడు గంటలకి ప్రారంభమైతే 9 గంటలకు సెలవు ప్రకటించడం ఏంటని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ మంత్రి సబితకి ట్వీట్లు చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు వర్షంలో తడుస్తూ స్కూల్ కి వెళ్లారని, తీరిగ్గా 9 గంటలకు మంత్రి సబితా ట్వీట్ చేయడం ఏంటి అని వారు ప్రశ్నింస్తున్నారు. వర్షంలో తడుచుకుంటూ వెళ్లి తమంత విద్యార్థులు దింపి వచ్చామని ఇప్పుడు మీరు సెలవులు ప్రకటిస్తే ఏం లాభం అంటూ చాలామంది మంత్రిని ట్రోల్ చేస్తున్నారు.

అలాగే ఈ సెలవు ప్రకటన ఫై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ సైతం మంత్రి సబితా ఫై సెటైర్ వేశారు. పిల్లలు స్కూల్ వెళ్లిన తర్వాత నిద్ర లేచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను చూస్తూ ఉదయం 9 గంటలకు స్పందించి సెలవులు ప్రకటించాలని ఈరోజు ఫాంహౌజ్ నుండి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సీఎం కేసీఆర్‌ పై కూడా సెటైర్లు వేశారు.