సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

హైదరాబాద్: నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సీఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్లతో సమీక్షించనున్నారు.

పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లపై కూడా చర్చిస్తారు. అలాగే ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై కలెక్టర్ల నుంచి సమాచారం తెలుసుకుంటారు. చివరిగింజ వరకు రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించనున్నారు. అలాగే జూన్‌ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/