విశాఖ పై వరాల జల్లు కురిపించిన మంత్రి నితిన్‌ గడ్కరీ..

దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ మొదటి రోజు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ముఖేష్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా వంటి 30కి పైగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. తొలిరోజు రూ.11.85 లక్షల కోట్లకు.. సంబంధించిన 92 ఎంఓయూలును కుదుర్చుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం హాజరై, విశాఖ పై వరాల జల్లు కురిపించారు. పోర్టుకు 6 లైన్ల హైవేకు సంబంధించిన మంత్రి కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా గడ్కారీ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేడు నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. అదే సమయంలో ఏపీ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉందని కొనియాడారు.

ఇక పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ఈ విధంగా ఉన్నాయి.

► రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ.

►ఏపీలోని క్రిష్ణ పట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకోసం రూ.10వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని జిందాల్ తెలిపారు.

►ఎన్టీపీసా ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు)

►ఏబీసీ లిమిటెట్‌ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు)

►రెన్యూ పవర్‌ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు)

►ఇండోసాల్‌ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు)

►అవాదా గ్రూప్‌( రూ 50 వేల కోట్లు)

►గ్రీన్‌ కో ఎంవోయూ(47, 600 కోట్లు)

►ఓసీఐఓఆర్‌ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు)

► హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ (రూ. 30వేల కోట్లు)

► వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (రూ. 21,844 కోట్లు)

► అదానీ ఎనర్జీ గ్రూప్‌ (రూ.21, 820 కోట్లు)

►ఎకోరెన్‌ ఎనర్జీ (రూ.15,500 కోట్లు)

►సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు)

►ఏసీఎమ్‌ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు)

►టీఈపీఎస్‌ఓఎల్‌ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు)

►జేఎస్‌డబ్యూ గ్రూప్‌(రూ. 50, 632 కోట్లు)

►హంచ్‌ వెంచర్స్‌(రూ. 50 వేల కోట్లు)

►ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు)

► అరబిందో గ్రూప్‌ (రూ.10, 365 కోట్లు)

►ఐపోసీఎల్‌ ఎంవోయూ(రూ. 4,300 కోట్లు)

►వర్షిణి పవర్‌ ఎంవోయూ(రూ, 4,200 ‍కోట్లు)

►ఆశ్రయం ఇన్‌ఫ్రా(రూ. 3,500 కోట్లు)

►మైహోమ్‌ ఎంవోయూ(3,100 కోట్లు)

►వెనికా జల విద్యుత్‌ ఎంవోయూ(రూ. 3000 కోట్లు)

►డైకిన్‌ ఎంవోయూ(రూ. 2,600 కోట్లు)

►సన్నీ ఒపోటెక్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)

►భూమి వరల్డ్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)

►అల్ట్రాటెక్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)

►ఆంధ్రా పేపర్‌ ఎంవోయూ(ర. 2వేల కోట్లు)

►మోండాలెజ్‌ ఎంవోయూ(రూ. 1,600 కోట్లు)

►అంప్లస్‌ ఎనర్జీ(రూ. 1,500 కోట్లు)

►గ్రిడ్‌ ఎడ్జ్‌ వర్క్స్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)

►టీవీఎస్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)

►హైజెన్‌కో ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)

►వెల్స్‌పన్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)

►ఒబెరాయ్‌ గ్రూప్‌(రూ. 1,350 కోట్లు)

►దేవభూమి రోప్‌వేస్‌(రూ. 1,250 కోట్లు)

►సాగర్‌ పవర్‌ ఎంవోయూ(రూ. 1,250 కోట్లు)

►లారస్‌ గ్రూప్‌(రూ. 1,210 కోట్లు)

►ఎలక్ట్రో స్టీల్‌ క్యాస్టింగ్స్‌(రూ. 1,113 కోట్లు)

►డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌(రూ. 1,110 ‍కోట్లు)

►దివీస్‌ ఎంవోయూ(రూ. 1,100 కోట్లు)

►డ్రీమ్‌ వ్యాలీ గ్రూప్‌(రూ. 1,080 కోట్లు)

►భ్రమరాంబ గ్రూప్‌(రూ. 1,038 కోట్లు)

►మంజీరాహోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌(రూ. 1,000 కోట్లు)

►ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌(రూ. 1,000 కోట్లు)

►శారదా మెటల్స్‌ అండ్‌ అల్లాయిస్‌(రూ. 1,000 కోట్లు)

►ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్టక్షన్స్‌(రూ. 1,000 కోట్లు)

►సెల్‌కాన్‌ ఎంవోయూ(రూ.1,000 కోట్లు)

►తుని హోటల్స్‌ ఎంవోయూ(రూ. 1,000 కోట్లు)

►విష్ణు కెమికల్స్‌(రూ. 1,000 కోట్లు)

►ఓ2 పవర్‌ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు)

► ఏజీపీ సిటీ గ్యాస్‌ (రూ. 10వేల కోట్లు)

► జేసన్ ఇన్‌ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు)

►ఆదిత్య బిర్లా గ్రూప్‌ (రూ. 9,300 కోట్లు)

►జిందాల్‌ స్టీల్‌ (రూ. 7500 కోట్లు)

►టీసీఎల్‌ ఎంవోయూ(రూ. 5,500 కోట్లు)

►ఏఎం గ్రీన్‌ ఎనర్జీ(రూ. 5,000 కోట్లు)

►ఉత్కర్ష అల్యూమినియం(రూ. 4,500 కోట్లు)