‘లై’ హీరోయిన్ ఇంట విషాదం

చిత్రసీమలో గత కొద్దీ రోజులుగా వరుస విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా నందమూరి తారకరత్న , కె.విశ్వనాధ్ వంటి వారు మరణించగా..తాజాగా లై, ఛల్ మోహన్ రంగా, డియర్ మేఘా వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మేఘా ఆకాష్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె బామ్మ మరణించారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యింది.

‘డియర్ అమ్మమ్మ.. నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా ఎలా బతకాలో నాకు అర్థం కావట్లేదు. అయినా నేను నీలాంటిదాన్నే. కాబట్టి.. ఎలాగైనా బతికేస్తాను అని అనుకుంటున్నా. ఎంతో సరదాగా ఉండే నువ్వు ఎల్లప్పుడూ అందరి ఆకలి తీర్చేందుకే ప్రయత్నించేదానివి. ఎలాంటి సమయంలోనైనా అందరినీ నవ్వించేదానివి. రోజు నీతో పెట్టిన ముచ్చట్లు బాగా గుర్తొస్తున్నాయి. ప్రతీ ఆదివారం మనకు ఎంతో సరదాగా గడిచేది. ఇకపై ఆదివారాలు అలా ఉండవు. మాతో లేకపోయినా.. మాలో ఎప్పుడూ ఉంటావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ తన ఆవేదన తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.