బండి సంజయ్ ని చెప్పుతో కొడతాం అంటూ మహబూబాబాద్‌ ఎంపీ కవిత వార్నింగ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్కను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా ? అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలఫై యావత్ బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం టీచర్ల సమావేశంలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో బిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు బండి సంజయ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు బీఆర్ఎస్ కార్యకర్తలు.

పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బండి సంజయ్ ని చెప్పుతో కొడతామని వార్నింగ్‌ ఇచ్చారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ మాలోవత్ కవిత. కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకోవాలని , వెంటనే కవిత కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. బండి సంజయ్ కి అక్కా చెల్లెలు లేరా ? బండి సంజయ్ ని… మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలన్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతామని వార్నింగ్‌ ఇచ్చారు. బండి సంజయ్ ని బిజెపి నుంచి బహిష్కరించాలని కోరారు. అలాగే సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నారు.