ఇప్పటంలో మళ్లీ ఇళ్లను కూల్చేస్ను అధికారులు

గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు

tension-in-ippatam-village-as-officials-demolishing-houses

తాడేపల్లిః గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అధికారులు మళ్లీ ఇళ్లను కూల్చేస్తున్నారు. జేసీబీలతో 8 కట్టడాల కూల్చివేతలను చేపట్టారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇళ్లను కూల్చి వేస్తుండటంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో గతంలోనే ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదం అయింది. దాంతో, అప్పట్లో కూల్చివేతలను ఆపేశారు. అప్పుడు కూల్చివేతల తర్వాత మిగిలినపోయిన మరో ఎనిమిది ఇళ్లను ఈరోజు కూల్చేస్తున్నారు. కళ్ల ముందే ఇళ్లను కూల్చేస్తుంటే గ్రామస్తులు కంటతడి పెట్టుకుంటున్నారు.