న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు గట్టి నిఘా

మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం..2023 కు బై..బై చెపుతూ..2024 గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు యావత్ ప్రజలు సిద్ధం అయ్యారు. ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ తో పాటు వైజాగ్ నగరాలు సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఏ రేంజ్ లో జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఇతర రాష్ట్రాల వారు సైతం హైదరాబాద్ కు వచ్చి వేడుకల్లో పాల్గొంటారు.

గతానికి భిన్నంగా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టి ఊహించని షాక్ ఇస్తున్నారు. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త టెక్నిక్స్ తో వస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రీత్యా హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించారు పోలీసులు. పబ్బులు, క్లబ్బులు, బార్‌లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. కొత్త టెక్నిక్ లతో రంగంలోకి దిగుతున్నారు. డ్రగ్స్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఈసారి సరికొత్తగా పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు.

అలాగే వైజాగ్ విషయానికి వస్తే..కొత్త సంవత్సరాన్ని భారీగా సెలబ్రేట్ చేయడానికి.. హోటల్స్, పబ్స్, రిసార్ట్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. దీంతో వైజాగ్ లో పర్యాటకులతో హోటల్స్, రిసార్ట్స్ నిండిపోయి.. హడావిడి వాతావరణం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. మరింత జాగ్రత్తలు చేపడుతున్నారు. ఒంటిగంట వరకు మాత్రమే విశాఖలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఉంటుందని సీపీ రవిశంకర్ వెల్లడించారు. పబ్, రిసార్ట్, చౌరస్తాల దగ్గర డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేయనున్నట్లు ప్రకటించారు.