వీడియోకాన్ సీఈవో వేణుగోపాల్ ధూత్ అరెస్టు

వీడియోకాన్ గ్రూప్ కు ఐసీఐసీఐ నుంచి రూ.3 వేల కోట్ల రుణం

Loan Fraud Case.. CBI arrests Videocon CEO Venugopal Dhoot

న్యూఢిల్లీః ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన రుణాల మంజూరు అవకతవకల కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు సోమవారం మరో ప్రముఖుడిని అదుపులోకి తీసుకున్నారు. వీడియోకాన్ గ్రూప్ సీఈవో వేణుగోపాల్ ధూత్ ను అరెస్టు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ సంస్థ రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే, ఈ రుణాన్ని మంజూరు చేయడంలో పలు అవకతవకలు జరిగాయని బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంపై దృష్టి సారించిన సీబీఐ అధికారులు.. లోన్ మంజూరులో క్విడ్ ప్రొ కో జరిగిందని తేల్చారు. చందా కొచ్చర్ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలో ఈ రుణాల మోసం జరిగినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఈవో చందా కొచ్చర్ తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను కూడా ఇటీవలే అరెస్టు చేశారు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి వీడియోకాన్ గ్రూపు సీఈవో వేణుగోపాల్ ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు నుంచి లోన్ పొందేందుకు వేణుగోపాల్ అక్రమాలకు పాల్పడ్డాడని సీబీఐ అధికారులు చెప్పారు. వీడియోకాన్ గ్రూపు తరఫున ప్రమోట్ చేసిన పలు కంపెనీల కోసం దాదాపు రూ. 3,250 కోట్లను ఐసీఐసీఐ బ్యాంకు రుణంగా అందజేసిందని వివరించారు. ఇందుకు ప్రతిగా ఐసీఐసీఐ బ్యాంకు నాటి చైర్మన్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కు చెందిన కంపెనీల్లో వేణుగోపాల్ రూ.64 కోట్లు పెట్టుబడులు పెట్టారని అధికారులు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/