తెలంగాణ వ్యాప్తంగా కొత్త లిక్కర్​షాపులు ఓపెన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త లిక్కర్​షాపులు ఓపెన్ అయ్యాయి.నవంబర్ 30న పాత మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియడంతో..కొత్త మద్యం షాప్స్ నిన్నటి నుండి ఓపెన్ అయ్యాయి. రెండేండ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులోనే టెండర్లు ఆహ్వానించగా.. 2,620 వైన్స్​కు లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ల అప్లికేషన్​ ఫీజు రూపంలోనే సర్కారుకు ఏకంగా రూ.2,629 కోట్లు సమకూరాయి.

షాపులు దక్కిన యజమానులు శుక్రవారం కొత్త వైన్స్ ను​ ప్రారంభించారు. రాష్ట్రంలో గతేడు 2,216 లిక్కర్​షాపులు ఉండగా.. సర్కారు ఈసారి కొత్తగా 404 షాపులు ఏర్పాటు చేసింది. దీంతో ఈ సంఖ్య 2,620కి చేరింది. మరో 1,200 బార్లు ఉన్నాయి. కొత్త షాపుల లైసెన్స్​గడువు రెండేండ్ల పాటు (2025, నవంబర్​30 వరకు) ఉంటుంది.