నాకు సపోర్టు నిలిచిన ఒక శక్తి నరేశ్ – పవిత్ర

మరోసారి వేదిక ఫై నరేష్ ఫై ప్రశంసలు కురిపించింది సీనియర్ నటి పవిత్ర. గత కొద్దీ నెలలుగా నరేష్ – పవిత్ర లు కలిసి సహజీవనం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ‘ మళ్లీ పెళ్లి ‘ అనే సినిమా చేసారు. MS రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ప్రేక్షకుల్లో , సినీ ప్రముఖుల్లో ఆసక్తి కలిగించింది.

ప్రమోషన్ లో భాగంగా ఆదివారం రాత్రి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భాంగా పవిత్ర మాట్లాడుతూ..”ఇక్కడికి వచ్చిన పెద్దలందరి ఆశీస్సులు నాకు కావాలి. ఎందుకంటే న్యూ లైఫ్ ను ఆరంభించబోతున్నాను. దేవుడు ఎలా నిర్దేశిస్తే అలా మనం మన లైఫ్ ను ముందుకు తీసుకువెళ్లవలసిందే. చిన్నప్పటి నుంచి అందరిలాగానే నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉండేవి. నా చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు”

“నా డ్రీమ్స్ ను నిజం చేసుకోవడం కోసమే సినిమాల్లోకి వచ్చాను. ఎంతో కష్టపడి నేను నా డ్రీమ్స్ ను నిర్మించుకున్నాను. దానిని కొన్ని దుష్టశక్తులు బ్రేక్ చేశారు. ఆ సమయంలో నాకు సపోర్టు నిలిచిన ఒక శక్తి నరేశ్ గారు. ఇక ఇప్పుడు మళ్లీ నా లైఫ్ ను బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టాను’ అంటూ తెలిపింది.

ఇక నరేశ్ మాట్లాడుతూ .. “నా తొమ్మిదో ఏట ‘పండంటి కాపురం’ సినిమాతో నటుడిగా నా ప్రయాణం మొదలైంది. అప్పుడు మేకప్ వేస్తుంటే నేను పొందిన అనుభూతిని ఇంకా మరిచిపోలేదు” అని అన్నారు.

“సీనియర్ ఆర్టిస్టుల ఆశీస్సులతో ఇంతవరకూ వచ్చాను. నా 19వ ఏట ఎవరికో మంచి చేయడం కోసం మా అమ్మ నన్ను ఒక మాట అడిగింది. అలా చేయడం వలన ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తరువాత నేను ఒకరిని కోరుకున్నాను. ఆ కలయిక సింహస్వప్నంగా మారింది. నిన్ను రాజును చేశాను గానీ .. మంచి లైఫ్ ను ఇవ్వలేకపోయానని మా అమ్మ బాధపడింది. ఇప్పుడు హ్యాపీనమ్మా .. నేను ఒక అమ్మను కలిశాను అని చెప్పాను” అన్నారు.

“ఆ తరువాత కృష్ణగారి ఆశీస్సులు తీసుకున్నాము. కృష్ణగారు – విజయనిర్మల గారు ఇద్దరూ కూడా నాకు ధైర్యాన్ని నేర్పారు. ఒక పెళ్లిలో ఆత్మీయతను .. తోడును .. నమ్మకాన్ని కోరుకుంటాము. ఈ విషయంలో ఇప్పుడు నేను నా గమ్యాన్ని చేరుకున్నాననే అనుకుంటున్నాను. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చారు.