ఫిలించాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయానికి..నివాళ్లు అర్పించిన తలసాని

ఫిలించాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయానికి..నివాళ్లు అర్పించిన తలసాని

సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త యావత్ సంగీత ప్రియులను శోకసంద్రంలో పడేసింది. సిరి ఇకలేరు అనేది తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సిరివెన్నెలను ఆఖరి చూపు చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల తరలివస్తున్నారు. ఇప్పటికే ఏపీ మంత్రి పేర్ని నాని నివాళ్లు అర్పించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళ్లు అర్పించి ..కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన సినిమా పాటలను గుర్తు చేసుకొని బాధపడ్డారు.

అలాగే ఉదయం నుండి కూడా రాజమౌళి, చిరంజీవి, గుణశేఖర్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, హీరో వెంకటేశ్‌, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సీనియర్‌ నటులు తనికెళ్ల భరణి, రావు రమేష్‌, అల్లు అరవింద్, మణి శర్మ, ఆచంట గోపినాథ్, పరుచూరి గోపాలకృష్ణ, సునీత, రామ జోగయ్య శాస్త్రి, నందిని రెడ్డి, ఎమ్మెస్ రాజు, అశ్వినిదత్, సాయికుమార్, కళ్యాణ్ మాలిక్, కాసర్ల శ్యామ్, సి కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, డివివి దానయ్య, బుర్ర సాయి మాధవ్, మురళి మోహన్, అల్లు అర్జున్, ఆర్టీసీ ఎండి సజ్జనార్, మహేష్ బాబు , అల్లు అర్జున్ , బాలకృష్ణ , నాగార్జున తదితరులు నివాళులు అర్పించారు.