ఈరోజు నుండి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..

నెల మారిందంటే చాలు కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. ఈ నెలా ఫిబ్రవరి లో కూడా అలాంటి రూల్సే అమల్లోకి వచ్చాయి. ముఖ్యముగా నెల మారిందంటే గ్యాస్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ధర పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటుంది. కానీ ఈ నెల లో మాత్రం అలాంటిది ఏమీజరగలేదు.

ఇక కార్ల ధరలును మాత్రం టాటా మోటార్స్ పెంచింది. డీజిల్, పెట్రోల్ ప్యాసింజర్ వాహనాల ధరల్ని 1.2 శాతం వరకు పెంచింది.

అలానే ఈరోజు నుండి గోవా వెళ్ళేవాళ్ళకి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. గోవా వెళ్లే వారు ఇకపై అలర్ట్‌గా ఉండాలి. బీచ్‌లో ఇతరుల అనుమతి లేకుండా వాళ్ళ ఫోటోస్ ని తీయకూడదు. ముఖ్యంగా ఫారినర్స్ ఫోటోలు క్లిక్ చేసి ఇబ్బంది పెట్టద్దు. అలానే బీచ్‌లో మద్యం సేవించకూడదు. వంటలు చేసుకోకూడదు. ఈ కొత్త రూల్స్ ని ఫాలో అవ్వకపోతే రూ.50,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె కడితే కనుక 1 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలానే ఫిబ్రవరి 13 నుంచి కెనరా బ్యాంక్ ఛార్జీలు పెంచనుంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేటి నుంచి రుణ రేట్లు ని పెంచేసింది.