టిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ మంత్రి కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: నేడు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ఆవిర్బావ దినోత్సవం. నేటికి పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రం లో కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌ఢౌన్‌ విధించడంతో పార్టి ఆవిర్బావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ అదినేత సూచించడంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు హంగు,ఆర్బాటాలు లేకుండా పార్టీ జెండాలను ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ పార్టీ యువనేత, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు.
ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయి కోట్ల పిడికిల్లు
ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయింది
స్ఫూర్తి ప్రదాతా వందనం.. ఉద్యమ సూర్యుడా వందనం
20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఉద్యమ బిడ్డలందరికి ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు
జైతెలంగాణ! జై జై కెసిఆర్‌
అంటూ ట్వీట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/