పార్లమెంట్‌కు చేరుకున్న ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Finance Minister Nirmala Sitharaman reached the Parliament

న్యూఢిల్లీః బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్‌కు చేరుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ . ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి ఆర్థిక ఖాతాను ఇస్తారు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ఉదయం 11 గంటలకు దేశ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

వరుసగా ఐదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్‌. ఆర్థికమాంద్యం భయాల నడుమ పార్లమెంట్‌ ముందుకు రానుంది కేంద్ర బడ్జెట్‌. ఈ నేపథ్యంలో వివిధ రంగాలు, రాష్ట్రాలకు కేటాయింపులు ఎలా ఉంటాయోనని యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఇవాల్టి బడ్జెట్‌లో సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశాలుంటాయని తెలుస్తోంది.