కొత్త విద్యావిధానంతో మేలిమలుపు సాధ్యమా!

మెరుగైన విద్యపై పర్యవేక్షణ అవసరం

New education system
New education system

నూతన జాతీయ విద్యావిధానం అమలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

గత మూడు దశాబ్దాలుగా అమలవుతున్న విధానం స్థానంలో కొత్తది రావడం అవసరం. అందుకోసం పనిచేసిన కస్తూరి రంగన్‌ కమిషన్‌ సిఫార్సులకనుగుణంగా ఈ విధానం అమలులోకి రానుంది.

అయితే ఇదిమేలైన నిర్ణయమేనా అన్నదికాలమే చెబుతుంది. ఈ రూపంలో వచ్చిన విధానంతో దేశమంతా విద్యలో ఏక రూపత వస్తుందని చెప్పొచ్చు.

కానీ గుణాత్మకంగా నాణ్యత వస్తుందా అంటే చెప్పలేం.నాణ్యత సాధించాలంటే అందుకు తగ్గ నిధులు, పర్యవేక్షణ, ప్రైవేట్‌ సంస్థలపై నియంత్రణ లాంటివి చాలా అవసరమవుతాయి.

ఆశయ పత్రంతోపాటు అమలుతీరు అన్నది ముఖ్యభూమిక పోషిస్తుంది.

ఇప్పుడున్న విధానంలో ఇంతవరకూ రాష్ట్రాలకు విద్య విషయంలో ఉన్న స్వతంత్ర ఇకపై ఉండదు.

ఈ మధ్య సిబిఎస్‌ఇ కరోనా కార ణంగా విద్యార్థులకు తగ్గించిన సిలబస్‌లో సమాఖ్యస్ఫూర్తి, కేంద్ర,రాష్ట్ర సంబంధాల పాఠం తీసేసిందని తెలిసింది.

కొత్తవిధానంలో నిజంగానే సమాఖ్య స్ఫూర్తికి అట్టే పట్టింపు ఉండదు.ఉమ్మడి జాబితాలోని విద్యపై రాష్ట్రంపాత్ర తగ్గి పోతుంది.ఇక కొత్త విధానంలో ప్రముఖంగా కనబడుతున్నది .

ఉన్నత విద్యాభ్యాసంలో వెసులుబాటు. డిగ్రీలో చేరి పూర్తి చెయ్యొచ్చు లేదా మధ్యలో మానేయొచ్చు లేదా కొంతకాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ పూర్తి చెయ్యొచ్చు.

అంతవరకూ చదివి నది లెక్కలోనే ఉంటుంది. అంటే ఇంతవరకూ డిగ్రీ పాస్‌ లేదా డిగ్రీ ఫెయిల్‌ అని రెండు తెగలుగా విద్యార్థులుండే వారు.

ఇప్పుడు వారే డిప్లొమా, సర్టిఫికేట్‌ హోల్డర్‌, డిగ్రీ పాస్‌, నాలుగేళ్ల రీసెర్చ్‌ డిగ్రీ పాస్‌లుగా వివిధ రూపాల్లో ఉంటారు.మంచిదే కానీ ఉద్యోగాల కొరత ఉన్నప్పుడు ఎలా ఉన్నా చివరికి ఒక్కటే.ఉద్యోగి లేదా నిరుద్యోగి అంతే.

పాఠ శాలల్లో ఒకేషనల్‌ కోర్సులు, డిజిటల్‌ పాఠాలు చదువ్ఞలో అంతర్భాగం చేయడం మంచిదే. ఇంతవరకూ పాఠశాల విద్యలో కానీ, ఉన్నత విద్యలోకానీ నాణ్యతాలోపం పెద్ద శాపం.

విద్యావ్యాపారంపై ప్రభుత్వ నియంత్రణ లేక విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండాపోతోంది. మరోవైపు నిరుద్యోగం పెరిగింది.మానవ వనరులు వృధాగా మారుతు న్నాయి.

కాబట్టి ఏ విధానం తీసుకున్నా ఈ లోపాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. విద్యపై ప్రభుత్వ ఖర్చు గణనీయంగా పెరగాలి.అన్ని సౌకర్యాలున్న పాఠశాలల్ని ప్రతి ఊరిలో నెలకొల్పాలి. నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.

-డా.డి.వి.జి.శంకరరావు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/